వన్ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్ Oneindia Telugu News Update

Oneindia Telugu 2018-07-09

Views 413

1. గుహలోని వారిని కాపాడేందుకు మినీ సబ్‌మెరైన్: ఒళ్లు గగుర్పొరిచే సాహసం
2.ధోనీ ఖాతాలో మరో రికార్డు
3.నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
1.గుహలోని వారిని కాపాడేందుకు మినీ సబ్‌మెరైన్
థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం పన్నెండు గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో కొందరిని బయటకు తీసుకు వచ్చారు. కోచ్‌తో పాటు మిగతా వారిని తీసుకు వచ్చేందుకు రెండో దఫా ఆపరేషన్ ప్రారంభించనున్నారు. తొలిసారి కాపాడిన వారిని మొదట ఆరుగురిగా భావించినప్పటికీ, నలుగురిని మాత్రమే తీసుకు వచ్చారు.
వీరి ఆపరేషన్‌కు సాయంగా టెక్ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ఓ మినీ సబ్ మెరైన్‌ను రూపొందించారు. లాస్ ఏంజిల్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో దీనిని పరీక్షించిన వీడియో ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. బహుషా ఇది థాయ్ కేవ్ ఆపరేషన్‌కు ఉపయోగపడుతుందనుకుంటా అని పేర్కొన్నారు.
2.ధోనీ ఖాతాలో మరో రికార్డు
రికార్డుల రారాజు టీమిండియా వికెట్‌ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 ఫార్మాట్‌లో మరో రికార్డును కొల్లగొట్టాడు. టీ 20 సిరీస్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఈ ఘనతను సాధించాడు. సిరీస్ నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లో వికెట్ల వెనుక ఐదు క్యాచ్‌లు అందుకున్న ధోనీ.. టీ20ల్లో 50 క్యాచ్‌లు అందుకున్న ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.
3.నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
నిర్భయ కేసులో దోషులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉరిశిక్షనే ఖాయం చేస్తూ సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ నేరస్తులు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వారికి ఉరిశిక్షనే సరి అని తేల్చింది.
ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది
4. జగన్, పవన్‌లను తిట్టడం పనిగా, దొంగదీక్షలు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గడిచిన నాలుగేళ్లలో చేసిందేమీ లేదని, ఏ రంగానికైనా మేలు చేస్తే చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒంగోలు బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తిట్టుకుంటూ బతకడం తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ఆరోపించారు.


Read and View all latest news headlines from India and around the world, get today's breaking news and live updates on politics, elections, business, sports, economy...
#news
#Oneindiatelugu
#Update
#Sports
#Movies

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS