సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ పోస్ట్

Oneindia Telugu 2018-07-07

Views 105

అర్జెంటీనా మార్క్సిస్ట్, క్యూబా విప్లవకారుడు చేగువేరా అంటే జనసేన పార్టీ అధినేత, ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఎంత అభిమానమో తెలిసిన విషయమే. పలు సినిమాల్లో చెగువేరా ఫొటోను కూడా పవన్ ఉపయోగించారు.
కాగా,శనివారం చెగువేరా విగ్రహం పక్కన తన కుమార్తె పొలినా అంజని దిగిన ఫొటోను పవన్ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. చెగువేరా ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని పవన్ తెలిపారు.
ఇది సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ మ్యూజియంలో తన కుమార్తె చేగువేరా మైనపు విగ్రహంతో దిగిన ఫొటో అని పవన్ చెప్పారు. నెల్లూరులో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు చెగువేరా జీవితం గురించి చదివానని, ఇప్పటికీ చదువుతున్నానని తెలిపారు. ఆయన ప్రభావం తన జీవితంపై ఉందని చెప్పారు.
ప్రపంచంలో అరాచకం, దోపిడీ, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు.. నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ.. నీకు వ్యక్తిగతంగా ఏమి జరగనప్పటికీ.. నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలి అనే విషయాన్ని నేను చేగువేరా జీవితం నుంచి నేర్చుకున్నా' అని పవన్ తెలిపారు.

Janasena president and Tollywood Power Star Pawan Kalyan Recently, posted a picture with his siblings and today, he shared a picture of his daughter Polena where she posed alongside a wax statue of revolutionary leader Che Guevara.
#PawanKalyan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS