Alluri Seetharama Raju 121 Birthday Special

Oneindia Telugu 2018-07-04

Views 307

స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి కేసు పై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నేతాజీ మృతి పైన కేంద్రం అన్ని ఫైళ్లను బహిర్గతం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. ఇదిలా ఉండగా, నేతాజీ వలె బ్రిటిష్‌పై పోరాడిన విశాఖ మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు మృతిలో కూడా ట్విస్ట్ ఉందా? అంటే కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చరిత్రలో మనం చదువుకున్న విధంగా అల్లూరి సీతారామరాజు మృతి చెందకపోయి ఉంటారని అంటున్నారు. బ్రిటిష్ వాళ్లు చంపింది... అల్లూరి సీతారామరాజు అనుచరుడు ఉప్పరపల్లి వీర వెంకట చారి కావొచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిఎన్ఏ పరీక్షల కోసం కూడా డిమాండ్ వినిపిస్తోందని అంటున్నారు. అల్లూరి సీతారామ రాజు... స్వామీజీగా ఆ తర్వాత మారి ఉంటారని పలువురు స్థానికులు భావిస్తున్నారని తెలుస్తోంది. శ్రీ పరమహంస చిద్వెంకట రామ బ్రహ్మానంద మహర్షిగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని బెండపూడిలో ఉండేవారని అంటున్నారు.

Like Netaji Subhas Chandra Bose in West Bengal, in AP, too, it is believed that Alluri Seetharama Raju, who also fought the British –– with the help of local tribals in Vizag Agency – had not as was recorded in history.

Share This Video


Download

  
Report form