Latha Rajinikanth pulled up by SC over non-payment of dues. Kochadaiiyaan movie issue
#LathaRajinikanth
#Kochadaiiyaan
2014 లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చాడియాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ఈ చిత్రాన్ని దర్శకురాలు. మోషన్ క్యాప్చర్ విధానంతో ఇండియాలోనే ఆమె తొలిసారి ఈ చిత్రాన్ని రూపొందించారు. రజనీలాంటి సూపర్ స్టార్ తో ఈ ప్రయోగం చేయడంతో దారుణంగా బెడిసికొట్టింది. బయ్యర్లు కూడా పీకల్లోతు చిక్కుల్లో మునిగిపోయారు. ఈ చిత్రం ఎఫెక్ట్ రజిని ఫ్యామిలీపై ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తాజగా సుప్రీం కోర్టు రజని సతీమణి లతా రజనీకాంత్ తీరుని తీవ్రంగా తప్పుబట్టింది.
మోషన్ క్యాప్చర్ విధానాన్ని సౌందర్య రజనీకాంత్ తొలి సరి ఉపాయోగించడంతో ఈ చిత్రం భారీగా యాక్షన్ సన్నివేశాలతో ఉంటుందని అంతా భావించారు. కానీ చివరకు చిన్నపిల్లలు ఆనందించే యానిమేషన్ చిత్రం బయటకు వచ్చింది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
ఈ చిత్రాన్ని రజనీ కుటుంబమే నిర్మించడం విశేషం. లతా రజనీకాంత్ ఈ చిత్రం కోసం బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ నుంచి 14 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇప్పటికి ఆ లోన్ కు సంబందించిన 6 కోట్ల బకాయిలు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో సదరు సంస్థ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆ సమయంలోన్యాయస్థానం లతా రజనీకాంత్ కు మూడు నెలల గడువు ఇచ్చారు. ఆ లోపు బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.