Jagapathi Babu Playing A Role In Ysr Biopic

Filmibeat Telugu 2018-07-02

Views 578

Yatra, the biopic on former chief minister of erstwhile Andhra Pradesh YS Rajasekhara Reddy, is making headlines with some interesting casting choices made by the makers. As per lates buzz, Jagapathi Babu will be playing YSR’s father YS Raja Reddy.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'. వైఎస్ఆర్ కుటుంబంతో పాటు ఆయన రాజకీయ సహచరులు, ఆయన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను ఫోకస్ చేయడంతో పాటు ... ముఖ్యమంత్రి కావడానికి ముందు వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పాదయాత్రను ఫోకస్ చేస్తూ ఈ మూవీ సాగబోతోంది. వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్న ఈ మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రకు జగపతి బాబును తీసుకోబోతున్నట్లు టాక్.
వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటించబోతున్నారని, ఆయన పాత్రకు జగపతి సరిగ్గా సరిపోతారని నిర్ణయానికి వచ్చిన చిత్ర బృందం ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
రాయలసీమ ఫ్యాక్షన్ గొడవల్లో 1998లో జరిగిన బాంబు దాడిలో వైఎస్ రాజారెడ్డి మరణించారు. ఈ సినిమాలో రాజారెడ్డి గురించి సామాన్య ప్రజలకు తెలియని చాలా విషయాలు చూపించబోతున్నారట.

Share This Video


Download

  
Report form