Sudigali Sudheer Emotional About Rashmi Guatam

Filmibeat Telugu 2018-06-30

Views 3

Rumours about the romantic relationship between Anchor Rashmi Gautham & 'Jabardasth' fame Sudigali Sudheer have been in circulation since some time. On the talk about marriage with Sudigali Sudheer, Rashmi clarified: 'People keep asking Me about it. But, We are good friends professionally. We are working together for Jabardasth and Dhee apart from hosting many events. Recently Sudheer emotionally bursts about Rashmi Gautam
యాంకర్, సినీ నటి రష్మీ, జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య ఉండే రిలేషన్‌‌పై అందరికీ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వారిపై వచ్చే రూమర్లకు బలం కలిగించే మాదిరిగాన పలు కార్యక్రమాల్లో వారి ప్రవర్తన కూడా ఉంటుంది. రష్మీ, సుధీర్‌ అఫైర్ గురించి ఏవేవో వార్తలు వస్తుంటాయి. మీడియాకు క్రేజీ జంటగా మారిన వారు ఇటీవల ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికరమైన అంశానికి తెర లేపారు.
ప్రముఖ టెలివిజన్ చానెల్‌లో ప్రజాదరణ పొందిన డ్యాన్స్‌లో వీరిద్దరూ మెంటర్స్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో హాయ్ రే.. హాయ్ రే.. హాయర్ రబ్బా అనే పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. అనంతరం రష్మీ, సుధీర్‌ను కలిపి యాంకర్ ప్రదీప్ ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.
సుధీర్ నీకు రష్మీ ఎందుకు ఇష్టం అని అడుగగా.. చందమామ ఎందుకు ఇష్టం అంటే ఏం చెబుతాం. రష్మీ ఎందుకు ఇష్టం అంటే అదే నా సమాధానం అని సుధీర్ కౌంటర్ ఇచ్చారు. దాంతో రష్మీ ఆనందంలో మునిగిపోవడమే కాకుండా తబ్బిబ్బయ్యారు.
సుధీర్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టేందుకు ప్రదీప్ మరో ప్రశ్న వేశాడు. చందమామలో మచ్చ ఉంటుంది కదా.. అంటే.. మచ్చ లేని చందమామ రష్మీ అని సుధీర్ సమాధానం ఇవ్వడంతో మళ్లీ షాకవ్వడం రష్మీ వంతైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS