వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్‌...జగన్‌

Oneindia Telugu 2018-06-29

Views 5

Pawan Kalyan's support proposal has not come till now...even without the support of any party, YCP is capable of competing in the elections, the YS Jagan said. In a special interview given to a national magazine, Jagan expressed his views on various issues.
పవన్ కళ్యాణ్ మద్దతు గురించి తన వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని...అయినా ఎవ్వరి మద్దతూ లేకుండానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సత్తా తమ పార్టీకి ఉందని వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌ పార్టీని విజయపథాన నడిపించారు. ఆయన కుమారుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలోనే 'ప్రజా సంకల్పం' పేరుతో పాదయాత్ర చేస్తూ ఇప్పటికి 200 రోజులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే...ఈ నేపథ్యంలో ఆయనను ఒక ఆంగ్ల జాతీయ పత్రిక ఇంటర్వ్యూ చేసింది. అందులో ప్రధానాంశాలు...
ఈ పాదయాత్రలో ప్రతి రోజూ నాకు ఒక కొత్త అనుభవమే...ఈ అనుభవం నుంచి నేను ప్రతిరోజూ ఎంతో నేర్చుకుంటున్నాను. బహుశా నాకు ఎదురయ్యే మనుషులు మారొచ్చు...కానీ వారి దీన స్థితిగతులు మాత్రం మారలేదు. కొన్ని చోట్ల వారి పరిస్థితుల్లో కొంత తేడా ఉండొచ్చు. గత నాలుగేళ్లుగా సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అప్పుల భారాన్ని మోస్తూ సతమతం అవుతున్నారు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలి పోయింది. గ్రామాల్లో ప్రజాస్వామ్యమనేదే లేదు. టీడీపీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు స్థానిక ప్రభుత్వాల అధికారాలన్నింటినీ హరించి వేశాయి. పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలన్నా చివరకు మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నా...ఈ కమిటీలు టీడీపీ నేతల ద్వారా వెళ్లే వారికి మాత్రమే ఇస్తున్నాయి. ప్రజల చేత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలి పోయారు.
#andhrapradesh
#ycp
#ysjagan
#padayatra
#interview
#support

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS