Renu Desai strong warning to Pawan Kalyan fans. She made sensational comments on her divorce
పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని విసిగిస్తున్నారంటూ చాలా రోజులుగా రేణుదేశాయ్ చెబుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమె రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ కు అభిమానుల తాకిడి ఎక్కువైంది. సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ పేరుతో ట్రోలింగ్ జరుగుతోంది. విసుగెత్తిపోయిన రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాని క్లోజ్ చేశారు. తాజగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తికి రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై సంచలనం రేపే విధంగా ఉంది. ఈ రిప్లైతో రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
స్వయంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా రేణు దేశాయ్ కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ పవన్ ఫాన్స్ మాత్రం రేణు దేశాయ్ ని ట్రోల్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ అభిమాని వ్యాఖ్యలకు రిప్లై ఇస్తూ రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన విడాకుల ప్రస్తావన తీసుకుని వచ్చారు. రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేవిగా ఉన్నాయి.