Kuldeep Yadav bagged the man of the match for his figures of 4/21 against Ireland. Here's he talking to the press after the effort.
#kuldeepyadav
#india
#cricket
#ireland
"ఇది నా మొదటి యూకే పర్యటన. ఈరోజు ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది" ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 అనంతరం టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పిన మాటలివి. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారత విజయంలో కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. ఒక ఓవర్ మెయిడిన్‌గా వేశాడు. దీంతో మెరుగైన ప్రదర్శన చేసినందుకుగాను కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ "ఇది నా మొదటి యూకే పర్యటన. మంచి ఆరంభం దక్కింది. ఈరోజు ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. భిన్న శైలిలో సరైన ప్రదేశాల్లో బంతులేయడానికి ప్రయత్నించాను. మ్యాచ్ ప్రారంభానికి ముందు నేను, చాహల్ బౌలింగ్ ఎలా వేయాలన్న దాని గురించి చాలా చర్చించుకున్నాం" అని అన్నాడు.