AP CM N. Chandrababu Naidu is likely to shift from Kuppam for the next Assembly elections to make way for his son and minister Nara Lokesh to contest from his traditional seat in Chittoor district. Kuppam is a TD stronghold from where Mr Naidu has won six elections. There was confusion in the TDP ranks over Mr Lokesh contest, But Lokesh clarified matters on Tuesday saying: "I will contest in the next Assembly elections and it is certain.
#andhrapradesh
#amaravathi
#naralokesh
#Elections
#kuppam
#chandrababu
వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారని తొలుత వార్తలు రాగా, ఆ తరువాత కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే లోకేష్ కుప్పం నుంచే పోటీ చేస్తారని భావించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారసుడు లోకేష్ పోటీకి వివిధ నియోజకవర్గాల పేర్లను పరిశీలించిన అనంతరం...వీటన్నింటికంటే సేఫ్ అండ్ సెంటిమెంటల్ ప్లేస్ కుప్పం నియోజకవర్గం మాత్రమేనని సిఎం చంద్రబాబు నిర్ణయించారట. కుమారుడి కోసం తానే సీటు త్యాగం చేయడం సమంజసమనే భావన కూడా చంద్రబాబులో ఉందంటున్నారు.
మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తానని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. అలాగే ముందస్తు ఎన్నికలపైనా ఆయన స్పందించారు. ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే...ముందే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు.