తమిళనాడులో గురువు పై విద్యార్థుల ప్రేమ

Oneindia Telugu 2018-06-23

Views 1

a government teacher in Tamil Nadu who had been transferred to another school was mobbed by his weeping students who did not want him to go. The students said that G Bhagawan was the best thing that had happened to them.
#TamilNadu
#governmentteacher

"మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ" అంటూ తల్లిదండ్రుల తరువాతి స్ధానం గురువుకే ఇచ్చిన దేశం మనది...! "గురువు" అనే పదానికి అర్ధం "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అని పిలుస్తారు, "గు" అంటే గుహ్యమైనదానిని , "రు" అంటే దానిని రుచ్యము చేసేవాడు అంటే ఆ రహస్యాన్ని తెలియపరిచేవాడు, అదీ గురువంటే...!
ఇక అసలు విషయానికొస్తే తమిళనాడులోని భగవాన్ అనేప్రభుత్వ టీచర్ మరో స్కూలుకు బదిలీ అయ్యారు. అయితే స్కూలు వీడి మరో స్కూలుకు వెళుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. భగవాన్‌ను వేరే స్కూలుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పిల్లలు తనపై పెంచుకున్న ప్రేమకు ఫిదా అయిన భగవాన్ కూడా కంట నీరు పెట్టుకున్నారు.
తమకు భగవాన్ దేవుడిచ్చిన వరం అని విద్యార్థులు చెప్పుకొచ్చారు. విద్యార్థులు భగవాన్‌ను అడ్డుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించారు. ఈ వీడియో చూసిన ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ ఇది గురుశిష్యుల బంధం అంటూ ట్వీట్ చేయగా...గురుశిష్యుల మధ్య ఇలాంటి అనుబంధం చూసి కదిలిపోయాను అంటూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ అనిల్ స్వరూప్ ట్విటర్‌లో స్పందించారు. ఇలాంటి ఉపాధ్యాయులు మరింత మంది రావాలని ఆయన ఆకాంక్షించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS