YSR Congress Party leader Ambati Rambabu Comments on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for his Niti Aayog attitude.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇక్కడ పదేపదే చెప్పుకున్న చంద్రబాబు, తీరా సమావేశానికి వెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి దండాలు పెట్టారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబులో ఓవైపు భయం, మరోవైపు వినయం కనిపించాయని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. నాటకాలు ఆడటంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరన్నారు. ఆయన పేపర్ పులిలా ఉన్నారన్నారు.
అమరావతిలో పెద్దపెద్ద గాంఢ్రింపులు చేసే చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లి నవ్వులతో పలకరింపులు అన్నారు. రాజనీతితో వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సరికాదన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా అవినీతి ఉందన్నారు. ఏపీ మొత్తాన్ని చంద్రబాబు అవినీతిమయం చేశాడని, అలాంటి వ్యక్తి నీతి ఆయోగ్‌లో ఏం మాట్లాడుతారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో 20 నిమిషాల పాటు మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని బీజేపీ నేతలు ఖండించారు. సమయం విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.