టీడీపీ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల వ్యూహం

Oneindia Telugu 2018-06-13

Views 7


రాబోవు ఎన్నిక‌ల్లో ఆంద్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలను కీల‌క‌ మ‌లుపు తిప్ప‌బోతున్నాయి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మ‌ద్ద‌త్తు తెలిపిన రెండు జిల్లాల ప్ర‌జ‌లు ఇప్పుడు కాస్త వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా, నేత‌ల కుమ్ములాట‌లు, జ‌న‌సేన అంశాలు ఈ రెండు జిల్లాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో మాత్రం తెలుగుదేశం పార్టీని ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌లు అంత‌గా ఆద‌రిస్తారా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.
గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిదే అధికారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అదే ట్రెండ్. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీపశ్చిమ గోదావరి జిల్లాలోని 14 సీట్లలో 14 సీట్లు దక్కించుకుంది. అప్పటి మిత్రపక్షం బిజెపితో కలుపుకుని. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేట్లు కనపడుతోంది. ఈ సారి 14సీట్లు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార టీడీపీ ఆరు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకొంటే గొప్పేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా వ్యవసాయాధార ప్రాంతం. గత ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ హామీని పూర్తిగా అమలు చేయటంలో విఫలమయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS