YSR Congress Party chief YS Jagan Mohan Reddy Padayatra enters into East Godavari district on Tuesday evening.
#YSRCongressParty
#YSJaganMohanReddy
వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ బ్రిడ్జికి చేరుకొని జిల్లాలోకి ప్రవేశించగానే వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాంట్ సెంటర్ వద్ద మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు రెండు అబద్దాల సినిమాలు చూపిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్‌తో అదిగో సింగపూర్, అదిగో జపాన్, అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో ఎయిర్ బస్, అదిగో రాజధాని అంటూ అమరావతిని చూపిస్తున్నారన్నారు. రెండో సినిమా పోలవరం అన్నారు. అమరావతి సినిమాలో ఒక్క ఇటుక పడలేదన్నారు. ఇక పోలవరం పేరుతో ప్రతి సోమవారం పోలవరం అంటూ సినిమా చూపిస్తున్నారన్నారు. కలెక్షన్లు రాబట్టడం కోసం వారానికోసారి రివ్యూ చేస్తున్నారన్నారు. పునాది గోడ (డయా ఫ్రం వాల్) అయిపోయిందంటూ జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. కానీ ఇందులో ఎక్కువ శాతం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయిందన్నారు. చంద్రబాబు మోసం చేయడంలో పీహెచ్‌డీ తీసుకున్నారన్నారు.