Oats Helps In Weight Loss Alot

Oneindia Telugu 2018-06-09

Views 135

Oats help in preventing binge-eating by keeping you full. Oats have low starchy carbs that regulate excess water content and also contain proteins and fibre which aid digestion. Weight gain leads to various health issues like obesity, blood pressure, sugar, cholesterol, etc. and eating oats can help in keeping these at bay.

బిజీ లైఫ్ అనేది ఈరోజుల్లో సర్వసాదారణమైపోయిన అంశం. ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన మనిషి ఒక్కోసారి రాత్రి రెండైనా నిద్రకు ఉపక్రమించలేనంతటి దుస్థితి. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారానికి కూడా నిర్దిష్టమైన సమయం కేటాయించలేక, తీసుకునే ఆహారంలో కాలరీల సంఖ్య అధికమవడం వలన, ఊబకాయానికి గురవడమే కాకుండా ఫాట్సో లాంటి బిరుదులతో బ్రతుకుబండి ఈడుస్తున్నారు.
ఈ సర్వసాధారణమైన సమస్యను పరిష్కరించడానికి, మన విలువైన సమయాన్ని వృధా చేయకుండా, శరీరంలోని చెడు కొవ్వు నిల్వలు తగ్గించడానికి, మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఒక మార్గం ఉంది.
ఈ ఊబకాయానికి కారణమయ్యే అనేక అంశాలకు ఒకే ఒక్క సమాధానం ఓట్స్. అధిక బరువు అనేది అనేక వ్యాధులకు ప్రధాన కారకం. అనగా రక్తపోటు, మధుమేహం , అజీర్ణ సమస్యలు మొదలైన సాధారణ దీర్ఘకాలిక సమస్యలకు ప్రధాన హేతువుగా ఈ ఊబకాయం ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలలో కనిపించే అనేకములైన సాధారణ వ్యాధులు ఊబకాయం వలనే సంభవిస్తున్నాయి అనడంలో ఏమాత్రం ఆశర్యం లేదు. ఓట్స్ బరువును తగ్గించటానికి సిఫార్సు చేయబడిన అత్యంత సులభమైన ఆహారం. ఎక్కువ మొత్తంలో పోషక విలువలు ఉండడమే కాకుండా, మానవ శరీరం యొక్క ప్రాధమిక పోషక అవసరాన్ని తీర్చటానికి సూచించదగ్గ ఆరోగ్యకరమైన ఆహారపదార్ధంగా ఉన్నది. కొన్ని అధ్యయనాల ప్రకారం, వారంలో 5 సార్లు కనీసం ఓట్స్ ఆహారంగా తీసుకోవడం మూలంగా, శరీరంలోని క్రొవ్వులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతాయని తేలింది. ఓట్స్, మానవ శరీరంలోని చెడు కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కండరాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది కూడా. ప్రతిరోజూ ఆహారంలో ఓట్స్ ఎందుకు తీసుకోవాలి?
1.ఓట్స్, అధిక నీటి నిల్వలను నియంత్రించే తక్కువ పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఓట్స్ మన నడుము యొక్క చుట్టుకొలతను తగ్గించడంలో సహాయం చేస్తుంది, అంతే కాకుండా జీవక్రియల రేటును పెంచడం ద్వారా శరీరానికి ఊబకాయం వలన కలిగే రోగాలను సైతం దరిచేరనీయకుండా చూడగలదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS