Hotstar registered a record no. of users, at one point they registered n 4.8 million simultaneous viewers which were the highest viewership ratings in Asia-Pacific. In the 10th edition, over 130 million users had tuned in on Hotstar.
#Hotstar
ముంబైలోని వాంఖడె వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డును సృష్టించింది. టీవీ వీక్షకుల ఆదరణలో ఈ సీజన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలోనే ఏ ఫైనల్ మ్యాచ్‌కు దక్కని వ్యూవర్ షిప్ ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ దక్కించుకుంది.
మే 27న ముంబైలోని వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఐపీఎల్ 11వ సీజన్ మ్యాచ్‌లను స్టార్ టీవీ నెట్‌వర్క్ 8 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. హాట్‌స్టార్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
ఐపీఎల్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 211 మిలియన్ల మంది వీక్షించారట. ఒక్క స్టార్ టీవీ నెట్‌వర్క్ చానళ్లలోనే 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దూరదర్శన్‌లో చూసిన వీక్షకులు దీనికి అదనం. గతేడాది రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్-ముంబైఇండియన్స్ మధ్య జరిగిన టైటిల్ పోరును 12 కోట్ల 10 లక్షల మంది వీక్షించారు.