చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన పవన్

Oneindia Telugu 2018-06-07

Views 534

Jana Sena chief Pawan Kalyan tour in Visakhapatnam's Paderu on Thursday. He lashed out at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేను సీఎంకు పాడేరు నుంచి చెబుతున్నానని.. మన్యంను అడ్డగోలుగా దోచేస్తున్నారని, ప్రభుత్వ ఖజానాకు పాడేరు నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని, ఇలా చేస్తే కళింగాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఇలా చేస్తే తెలంగాణ వలె కళింగాంధ్ర ఉద్యమం రావడం ఖాయమన్నారు. కళింగాంధ్ర ఉద్యమం ప్రారంభమైతే మీతో సహా ఎవరికీ సుఖ సంతోషాలు ఉండవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ మాట్లాడుతుండగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పదేపదే సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
తనకు హెరిటేజ్ ఉండగా రాజకీయాల్లో డబ్బులు అవసరమా అని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారని, అసలు మీకు వేతనాలు ఎందుకని పవన్ ప్రశ్నించారు. వేతనాలు తీసుకోకుండా పని చేయాలన్నారు. 2007 నుంచి తనకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పారు. నాటి నుంచి పోడు భూముల సమస్యలు వింటున్నానని చెప్పారు. ఆ భూములు ఇస్తారా లేదా చెప్పాలని నిలదీశారు. పోడు భూమి పట్టాలపై ఓ వివరణ కావాలని డిమాండ్ చేశారు. నేను ఇవ్వడానికి అధికారంలో లేనని చెప్పారు. టీడీపీ నేతలు మాట్లాడుతుంటే బాత్రూంలు కట్టించామని చెబుతారని, కానీ నీళ్లు లేని చోట ఏం కడితే ఏం లాభమన్నారు. సులబ్ కాంప్లెక్స్ కట్టించినా, ఏం కట్టించినా ఫలితం ఉండదన్నారు. ఈ సమస్యలు ఒక్క రోజుతో తీరేవీ కావని, నేను మీకు అండగా నిలబడేందుకు, పోరాటం చేసేందుకు వచ్చానని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS