There can’t be two swords in a sheath, goes the saying. That’s quite the issue confronting National badminton coach Pullela Gopichand as he grapples with the task of training Saina Nehwal and PV Sindhu at different venues.
#pullelagopichand
#sainanehwal
#pvsindhu
#badminton
ఇటీవలి కామన్ వెల్త్ గేమ్స్ లో పతకదారులుగా నిలిచిన తెలుగు తేజాలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు రెండు వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నాడు గోపీచంద్. ఇద్దరూ హేమాహేమీలుగా ఒకానొక సందర్భంలో ప్రత్యర్థులుగానూ ఆడాల్సి వస్తున్న తరుణంలో ఇలా నిర్ణయం తీసుకున్నాడు కోచ్ పుల్లెల గోపీచంద్ నిర్ణయించుకున్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గోపీచంద్, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
గతంలో తాను వేర్వేరు షెడ్యూల్స్ లో ఇద్దరికీ శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం కోచింగ్ జట్టు సమష్టిగా తీసుకున్న నిర్ణయం మేరకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నానని వెల్లడించారు. ఈ రెండు శిక్షణా కేంద్రాల మధ్య దూరం అర కిలోమీటర్ వరకూ ఉంటుందని ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇద్దరికీ చాలినంత సమయాన్ని తాను కేటాయిస్తున్నానని అన్నారు.