Most of the big multiplex theatres in the city faced on Sunday amid a rise in complaints of maximum retail price (MRP) violations in the stores located there.
#hyderabad
#multiplex
#mrp
#akunsabarwal
సినిమా హాళ్లలో తినుబండారాల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. సినిమా టికెట్ కంటే కొన్నిసార్లు వీటికే ఎక్కువ సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఎమ్మార్పీకి పొంతన లేని రేటుతో ఇష్టా రీతిన ధరలు పెంచేసి అమ్ముతున్నారు. అటు అధికారులు కూడా ఇన్నాళ్లు పట్టీ లేనట్టుగా వ్యవహరించడంతో వీరి వ్యాపారం బాగానే కళకళలాడింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడంతో వీరి బండారం బయటపడింది.
నగరంలోని చాలా మల్టీప్లెక్స్ లలో తినుబండారాలను ఎమ్మార్పీ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిప్స్ ప్యాకెట్స్, కుర్‌కురే వంటి ప్యాకెట్ల క్వాంటిటీ కూడా తగ్గినట్టు అధికారుల తనిఖీల్లో బయట పడింది.100 గ్రాముల ప్యాకెట్‌ను తూకం వేస్తే కొన్నిచోట్ల 90 గ్రాములే ఉంది. లూజ్‌గా అమ్ముతున్న పాప్‌కార్న్‌ను రూ.150కి విక్రయిస్తున్నారు.