కర్ణాటకలో 'కాలా' విడుదల కానివ్వం అంటున్న కన్నడిగులు

Oneindia Telugu 2018-06-02

Views 90

Karnataka Rakshana Vedike is protesting against the release of Rajanikanth's Kaala Cinema. The Karnataka film industry is upset with Rajinikanth's reported statement that whichever government comes to power in Karnataka, it should implement the Supreme Court order on Cauvery water.
#kaala
#rajanikanth
#karnatakarakshanavedika
#cauverywater

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యరాదని గత వారం రోజుల నుంచి కర్ణాటకలో ఆందోళనలు చేస్తున్నారు. కావేరి నీటి విషయంలో కన్నడిగులను కించపరుస్తూ కర్ణాటక రాష్ట్రానికి ద్రోహం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న రజనీకాంత్ కాలా సినిమాను విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ శనివారం బెంగళూరులో కర్ణాటక రక్షణా వేదిక ధర్నా నిర్వహించింది. కాలా సినిమా విడుదల చెయ్యాలని రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు.
రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా వచ్చే వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ముందు కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Share This Video


Download

  
Report form