Captain Sunil Chhetri led from the front with a hat-trick as hosts India flexed their muscles and outplayed Chinese Taipei 5-0 to begin their campaign on a rousing note in the four-nation Intercontinental Cup.
#sunilchhetri
#football
#Soccer
#FIFA
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా 'ఫిఫా' వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... భారత ఫుట్‌బాల్ జట్టు దిగువ స్థాయి టోర్నీలో శుభారంభం చేసింది. నాలుగు దేశాల ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆతిథ్య భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో చైనీస్ తైపీపై ఘనవిజయం సాధించింది. స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ సునీల్ ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్(14ని, 34ని, 62ని)తో విజృంభించగా, ఉదాంత సింగ్(48ని), ప్రణయ్ హల్దర్(78ని) ఒక్కో గోల్ చేశారు.
ముంబై ఫుట్‌బాల్ ఎరీనాలో ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో చైనీస్ తైపీ ఘోరంగా తేలిపోయింది. మ్యాచ్‌లో 67 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న టీమ్‌ఇండియా ప్రత్యర్థికి ఏ దశలోనూ గోల్‌చేసే అవకాశమివ్వలేదు. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ శాతం భారత గోల్‌కీపర్ గురుప్రీత్‌సింగ్ ప్రేక్షకునిలా మారాల్సి వచ్చింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన భారత్..లాల్‌ఫెకులా అందించిన పాస్‌ను సునీల్ గోల్‌గా మలిచి బోణీ కొట్టాడు.