Everything in her life has changed since her last Grand Slam appearance except her aura, undimmed by absence. Serena Williams walked onto center court at Roland Garros on Tuesday in a black bodysuit whose surface gleamed like tempered steel in the afternoon sunlight, interrupted only by a bright red band at her waist.
#serenawilliams
#frenchopen
#mariasharapova
#tennis
మాజీ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్ పునరాగమనాన్ని విజయవంతంగా నమోదు చేసింది. తొలి రౌండ్లో ఆమెకు గట్టి పోటీ ఎదురైనా.. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చి తొలిరౌండ్‌లో 7-6 /(7/4), 6-4తో ప్రపంచ 70వ ర్యాంకర్ ప్లిస్కోవా (చెక్)పై గెలిచింది. 2002, 13, 15లో ఇక్కడ టైటిల్స్ గెలిచినసెరెనా.. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సెరెనాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్.
గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. సెరెనా, ఫ్లిస్కోవా భారీ సర్వీస్‌లతో చెలరేగారు. మ్యాచ్ మొత్తంలో 28 ఏస్‌లు సంధించిన అమెరికన్.. తొలిసెట్‌లోనే 17 కొట్టింది. టైబ్రేక్‌లో ప్లిస్కోవా 3-0తో ఆధిక్యంలో నిలిచినా.. అనూహ్యంగా పుంజుకున్న సెరెనా వరుసగా ఆరు గేమ్‌లను చేజిక్కించుకుంది. రెండోసెట్‌లో తన సర్వీస్‌లో ఐదు బ్రేక్ పాయింట్లను కాచుకున్న సెరెనా కీలమైన ఐదో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.