Janhvi Kapoor Gets Serious Comments From Tweeters

Filmibeat Telugu 2018-05-30

Views 1

Sridevi's elder daughter Janhvi Kapoor graces the cover of Vogue for the first time and it seems fans are not at all happy to see that.

ప్రముఖ నటి శ్రీదేవి తన కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా చూడాలని ఆశ పడింది. అయితే ఆ ఆశ తీరేలోపే ఈ లోకాన్ని విడిచి అందరినీ బాధ పెట్టింది. కొందరు అభిమానులైతే శ్రీదేవి విషాదం నుండి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో జాహ్నవి కపూర్ చర్యలు అభిమానులను అప్ సెట్ చేశాయి. జాహ్నవి వోగ్ కవర్ పేజీ కోసం ఫోజులు ఇవ్వడంపై శ్రీదేవి ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తూ విరుచుకుపడ్డారు.
తన తల్లి చనిపోయిన బాధ జాహ్నవిలో కొంచెం కూడా కనిపించడం లేదు. జాహ్నవి తీరు చూస్తుంటే తల్లి మరణాన్ని తన తొలిసినిమాకు సింపతీగా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది అంటూ కొందరు విమర్శలకు దిగారు.
జాహ్నవి గత ఫోటోలకు, ఇప్పడు ఆమె కనిపిస్తున్న లుక్ చాలా భిన్నంగా ఉందని... వాటిని పరిశీలిస్తే జాహ్నవి ముక్కు, పెదాలకు సర్జరీలు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని మరికొందరు నెటిజన్లు విమర్శలకు దిగారు.
అయితే జాహ్నవిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న వారిపై ప్రముఖ కాస్టూమ్ డిజైనర్ మసాబా గుప్తా రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. జాహ్నవిని జడ్జ్ చేయడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు. జాహ్నవి కేవలం 22 సంవత్సరాల అమ్మాయి. ఇంత చిన్న వయసులో తన తల్లిపోయిన బాధను దిగమింగుకుని, ఆ బాధ పైకి కనిపించనివ్వకుండా ధైర్యంగా ముందుకు సాగుతోంది. జాహ్నవి నటి కావాలనేది కేవలం ఆమె కల మాత్రమే కాదు.... శ్రీదేవి కల కూడా, దాన్ని నిజం చేసేందుకు, తల్లిదండ్రులు గర్వపడేలా చేసేందుకు ఆమె ఎంతగానో కష్టపడుతోంది. ఆమెను ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని వ్యాఖ్యానించారు.

Share This Video


Download

  
Report form