Tollywood star Mohan Babu emotional tweet on Dasari anniversary. Dasari Narayana Rao was an Indian film director, producer, screenwriter, dialogue writer, actor, lyricist, and politician known for his works predominantly in Telugu cinema, Television, and Bollywood.
#MohanBabu
#DasariNarayanaRao
దర్శకరత్న దాసరి నారాయణ రావు..... తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండ్స్‌గా చెప్పుకోదగ్గ అతికొద్ది మంది ప్రముఖుల్లో ఒకరు. దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేయడమే కాదు, నటుడిగా, నిర్మాతగా, పత్రిక అధిపిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభాశాలి. ఇండస్ట్రీలో అందరి తలలో నాలుకలా మెదిలిన దాసరి సరిగ్గా ఏడాది క్రితం ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్న స్మరించుకుంటున్నారు. తాజాగా దాసరి గురించి ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో ఎమోషనల్‌గా స్పందించారు.
మీరు మాకు దూరమై ఏడాది అయిందని ఎవరన్నారు..అనుక్షణం ఎదుటే ఉన్నారు.. కలలో ఉన్నారు.. సలహాలు ఇస్తున్నారు..మా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నారు..ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం.. అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
దాసరి జీవించి ఉన్న కాలంలో ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా చిటికెలో పరిష్కరించే వారు. ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించి వారికి న్యాయం అందేలా చేయడంలో ముందు ఉండేవారు. దాసరి మరణం తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేక పోయారనే వాదన వినిపిస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో నటులు, దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు ఇలా ఎంతో మందికి సినీ జీవితం ప్రసాదించిన మహానుభావుడుగా ఆయనకు పేరుంది. పరిశ్రమ అభివృద్ధిలో దాసరి ఎంతో ముఖ్య భూమిక పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.