Do You Know the Salries Of IPL Coaches

Oneindia Telugu 2018-05-30

Views 74

Chennai Super Kings emerged as the winner of the eleventh edition of the Indian Premier League (IPL) 2018. They were paid Rs 20 Crore as the prize money while Sunrisers Hyderabad were awarded Rs 12.5 Crore. While prize money paid tp teams is available to everyone, let us have a look at the salaries of the coaches.
కోట్ల రూపాయల పెట్టుబడితో ఆరంభమైన ఐపీఎల్ సమరం ఇట్టే ముగిసిపోయింది. మే 26న ముగిసిన తుది సమరంలో చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడి చెన్నైకే ట్రోఫీ దక్కడంతో ఐపీఎల్ 2018కు తెరపడింది. 8 జట్లు హోరాహోరీగా తలపడిన ఈ సీజన్ గత పదేళ్ల కంటే విజయవంతమైంది. టోర్నీ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 కోట్లు గెలుచుకోగా.. రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌కి రూ.12.5 కోట్లు దక్కాయి.
మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా రాజస్థాన్ జట్లకు చెరో రూ.8.75 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఐపీఎల్ ఆటగాళ్లలో ఎవరికెంత దక్కిందో వేలం సమయంలోనే తెలిసింది. మరి కోచ్‌లకు ఎంత వరకూ ఇచ్చారంటే.. ఐపీఎల్ కోచ్‌లు, సహాయక సిబ్బందిలో ఎక్కువ మొత్తం అందుకునేది ఆర్‌సీబీ కోచ్ డానియెల్ వెటోరీ అని సమాచారం. తర్వాతి స్థానంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఉన్నాడు. నెహ్రాకి బెంగళూరు రూ.4 కోట్లు ముట్టజెబుతోంది.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు రూ.3.7 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు రూ.3.2 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌కు పంజాబ్ రూ.3 కోట్లు అందజేస్తోంది. రాజస్థాన్ తమ మెంటార్ షేన్ వార్న్‌కి రూ.2.7 కోట్లు వేతనంగా ఇస్తోంది. కోల్‌కతా ప్రధాన కోచ్ జాక్వెస్ కలిస్, ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనేలకు చెరో రూ.2.25 కోట్లు అందుతున్నాయి.
#chennaisuperkings
#ipl2018
#sunrisershyderabad
#Salaries

Share This Video


Download

  
Report form