Al Jazeera Sting: BCCI ACU Working Closely With ICC Over Fixing Claims

Oneindia Telugu 2018-05-29

Views 30

The BCCI on Sunday reacted cautiously to a sting operation which alleged pitch doctoring in three Test matches featuring India, saying it would consider action against implicated former cricketer Robin Morris only if he is found guilty in an ongoing ICC probe.
అవినీతికి పాల్పడి క్రికెట్‌ను దెబ్బతీసే ఏ చర్యను ఉపేక్షించేది లేదంటూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ) ప్రకటించింది. ఓ టీవీ ఛానల్‌ చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై నిజ నిర్ధారణలకు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం, ఐసీసీ అవినీతి నిరోధక విభాగంతో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. ఇప్పటికే ఈ అవినీతి ఆరోపణలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం కావడంతో బీసీసీఐ వేగంగా చర్యలు చేపట్టింది.
గత రెండేళ్లలో కనీసం భారత్‌ ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్స్‌ అయ్యాయని అల్‌జజీరా న్యూస్‌ ఛానల్‌ సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్‌లో అవినీతిపై తమ పరిశోధనా విభాగంతో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు దోహాకు చెందిన ఈ ఛానల్‌ పేర్కొంది. క్రికెట్‌లో అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది.
గాలేలో 2017, జులై 26 నుంచి 29 వరకు జరిగిన భారత్‌-శ్రీలంక టెస్టు మ్యాచ్‌, రాంచీలో 2017, మార్చి 16-20 మధ్య జరిగిన భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు, చెన్నైలో 2016, డిసెంబర్‌ 16-20 మధ్య జరిగిన భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు గురయ్యాయని ఆ ఛానల్‌ పేర్కొంది. బుకీల ప్రభావం ఈ మ్యాచ్‌లపై ఉందని ఆరోపించింది. ఈ మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్‌ గెలుపొందగా.. రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది.
#icc
#bcci
#cricket
#robinmorris
#india
#australia

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS