Sara Ali Khan Struck In A Case

Filmibeat Telugu 2018-05-26

Views 441

Kedarnath actor Sara Ali Khan and the makers of the film are at loggerheads with each other over her film Simmba. The Kedarnath makers, hence, dragged Sara to the Bombay High Court to stop her from working on another film and to direct her to complete her initial commitment. The case came up for hearing on Friday morning, before Justice SJ Kathawala, where Sara was represented by the law firm Naik and Naik.
#actorSaraAli


బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కుమార్తె కోర్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తొలి చిత్రంతోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తున్నది. తమతో ఒప్పందం కుదుర్చుకొన్న సైరా తమకు డేట్స్ కేటాయించకుండా మరో చిత్రానికి పనిచేస్తున్నదని కేదార్‌నాథ్ చిత్ర నిర్మాతలు ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే..
సైఫ్ ఆలీఖాన్, అమృతాసింగ్‌ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్‌లో కేదారినాథ్ చిత్రంతో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టింది. గత సెప్టెంబర్ 2017లో కేదారినాథ్‌ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ చిత్రం ఆగిపోయింది. అందుకు కారణం సారానే కారణమని నిర్మాత అభిషేక్ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేదారినాథ్ చిత్రానికి సంబంధించిన కేసు శుక్రవారం బాంబే హైకోర్టులో విచారించారు. కేదారినాథ్ చిత్రం పూర్తి చేసిన తర్వాత మరో చిత్రంలో నటించాలని నిర్మాత తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
ప్రస్తుతం సింహా చిత్రంలో సారా అలీఖాన్ నటిస్తున్నది. ఈ చిత్రం తెలుగులో పూరి జగన్నాథ్ రూపొందించిన టెంపర్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఏ మేరకు షూటింగ్‌కు పూర్తి చేయాల్సి ఉందని ఈ సందర్బంగా కోర్టు అడిగి తెలుసుకొన్నది.

Share This Video


Download

  
Report form