Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. For this movie, 74 year old writer Indraganti Srikantha Sharma writes a Great song
#Directo Indraganti Mohan Krishna
#Sammohanam
సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది. ''పెళ్లిచూపులు'' ఫేమ్ వివేక్ సాగర్ స్వరాలందించిన ఈ చిత్రంలో మొత్తం 4 పాటలు ఉన్నాయి. ''మనసైనదేదో వరించిందిలా... తలపై తరంగమై తరిమిందిలా... వలపో, పిలుపో, మురుపో.. ఏమో !... అంత వింతే ! అందే దెంతో ! '' అనే పాటను ప్రముఖ కవి 'ఇంద్రగంటి శ్రీకాంత శర్మ' విరచించారు. ఇటీవల ఆన్ లైన్లో విడుదలైన ఈ పాటకు విశేషాదరణ లభిస్తోంది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - '
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'గోల్కొండ హై స్కూల్' కోసం 'ఏనాటివో రాగాలు', ''అంతకుముందు ఆ తరువాత'' చిత్రం కోసం 'నా అనురాగం' అనే పాటను రచించారు. మా ''సమ్మోహనం'' లో కూడా ఏదైనా పాటను రాయించమని దర్శకుడ్ని నేనే కోరాను. ఆరోగ్యం అంతగా సహకరించని పరిస్థితుల్లో కూడా శ్రీకాంత శర్మ గారు అద్భుతంగా పాట రాశారు అని కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
74 ఏళ్ళ వయసులో ఇంత ఫుల్ రొమాంటిగ్గా రాస్తారని నేను ఊహించలేదు. కవిత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ పాట వింటే ఒప్పుకుంటారు. శ్రీకాంత్ శర్మ గారి పాటతో ఈ ఆల్బంకే ఒక నిండుతనం వచ్చింది. ఈ పాటలు ఎంత హాయిగా ఉంటాయో, సినిమా కూడా అంతే హాయిగా ఉంటుంది. ఒక తీపి గుర్తులా నిలిచిపోయే సినిమా ఇది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది" అని కృష్ణ ప్రసాద్ తెలిపారు