హైదరాబాద్ కు ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్

Oneindia Telugu 2018-05-18

Views 925

Kochi Crown Plaza is the destination it seems. It is a 5 star hotel located in Kundannur, Thevara. 5 kilometers from Ernakulam town. Hotel people asked to keep everything ready , according to our Kochi reporter.
#KarnatakaAssembly
#Emakulam
#Kochi
#Congress
#JDS

బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్టు నుంచి ఎక్కడికి తరలించాలనే విషయంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ ఉదయం జరిగిన ప్రచారం మేరకు.. జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లేదా వైజాగ్ తరలిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిని పంజాబ్ లేదా ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కేరళకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు కొచ్చి లోని క్రౌన్ ప్లాజాలో ఎమ్మెల్యేల కోసం 125 గదులు బుక్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్నాకులం పట్టణానికి 5కి.మీ దూరంలో కుందన్నూర్ వద్ద ఈ ఐదు నక్షత్రాల హోటల్ ఉంది. కొచ్చి వర్గాల సమాచారం మేరకు.. ఎమ్మెల్యేలకు అవసరమైన ఏర్పాట్లన్ని అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ సైతం కేరళ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రిసార్టులో ఏర్పాట్ల గురించి వీరి మధ్య సంభాషణ జరిగినట్టు చెబుతున్నారు.
బెంగళూరు నుంచి బస్సుల్లో బయలుదేరిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ హైవేపై మరో బస్సులోకి మారారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. రెండు పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్ కే వెళ్తున్నట్టు దీనితో తేలిపోయింది.
'బీజేపీ బేరసారాలకు బ్రేక్ వేయాలంటే మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఒకే బస్సులో ఒకే దగ్గరికి వెళ్తున్నారు' జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. బీజేపీ ప్రలోభాలను అడ్డుకోవడానికి బెంగళూరు నుంచి వారిని తరలించినట్టు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS