Janhvi Kapoor may be the next big thing in Bollywood and fashion designer Prabal Gurung has given his seal of approval to that thought. The popular designer met Janhvi on Wednesday and decreed her the one upcoming actor to look out for. “Guess who stopped by the showroom? The Future!! Y’all remember this name #JanhviKapoor. Janhvi wish you all the happiness, joy and success. May you reach for the moon with your feet always on the ground. Rooting for you. With love xPG. #Bollywood,” he wrote on Twitter. Janhvi was also ecstatic about meeting him. “Felt like home meeting Prabal Gurung (can we please appreciate how cool I felt saying that),” she posted on her Instagram story.
శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఇపుడు బాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్. త్వరలో 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న ఈ కపూర్ బేటీ ఫ్యూచర్లో బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్‌గా ఇండస్ట్రీని ఏలడం ఖాయం అని, తన అందంతో హిందీ పరిశ్రమను అల్లాడిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబల్ గురుంగ్ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ బుధవారం జాహ్నవిని కలిశాడు. ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేటెస్ట్ ట్రెండీ ఔట్‌ఫిట్స్ తీసుకొచ్చాడు. ఈ దుస్తువుల్లో జాను సరికొత్త లుక్‍తో దర్శనమిచ్చి అభిమానుల మతి పోగొట్టింది.
ఈ సందర్భంగా బాలీవుడ్ ఫ్యూచర్ ఫ్యాషన్ క్వీన్ జాహ్నవి అంటూ ప్రబల్ ట్వీట్ చేశాడు. మిడ్ రిప్స్ ఎక్స్ ఫోజ్ అయ్యేలా అతడు డిజైన్ చేసిన దుస్తువుల్లో జాహ్నవి మరింత అందంగా, హాట్‌గా కనిపిస్తోందంటూ ఈ ఫోటోలపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రబల్ గురుంగ్ నేపాలీ సంతతికి చెందిన అమెరికన్ డిజైనర్. న్యూయార్క్ కేంద్రంగా పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల కోసం సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ డిజైన్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. అతడి క్లయింట్ల ఖాతాలో ఇపుడు జాహ్నవి కపూర్ కూడా చేరిపోయింది.
జాహ్నవి కపూర్ త్వరలో ‘ధడక్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోంది. జులై 6 ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. తల్లి శ్రీదేవి మరణం, ఇటీవల సోనమ్ కపూర్ పెళ్లి కారణంగా జాహ్నవి సెలవు తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.