Pawan Kalyan To Attend Saksham Movie Audio Launch

Filmibeat Telugu 2018-05-16

Views 75

Pawan Kalyan to attend Saakshyam movie audio launch. Sriwas is directing this movie.
#PawanKalyan
#Saakshyamaudiolaunch

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయ కార్యక్రమాలతో పవన్ బిజీ కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించే అవకాశం లేకపోవడం ఆయన అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు.
నా పేరు సూర్య థాంక్యూ మీట్, నేల టిక్కెట్టు ఆడియో వేడుక ఒకే రోజు జరిగాయి. తీరిక చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఆ రెండు ఈవెంట్స్ కి హాజరయ్యారు. అటు బన్నీతో, ఇటు రవితేజ తేజతో పవన్ కళ్యాణ్ వేదికని పంచుకోవడం మెగా అభిమానులకు పండుగలా మారింది.
సినిమా ఈవెంట్స్ కు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఇటీవల ఆయన కొన్ని ఈవెంట్స్ కు హాజరవుతుండడం విశేషం. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా నితిన్ సినిమా వేడుకలకు హాజరయ్యారు. ఇష్క్, అ..ఆ, ఛల్ మోహన్ రంగ వంటి చిత్రాల ఆడియో వేడుకలకు పవన్ హాజరై సంగతి తెలిసిందే. మరో యువ హీరో ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 26 న జరగనున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ ని సంప్రదించి ఆడియో వేడుకకు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. తన పొలిటికల్ కార్యక్రమాల బిజీ షెడ్యూల్ ఉండడంతో పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదో చూడాల్సి ఉంది.

Share This Video

Download

Report form