Arun Vijay joins sets of Prabhas’ Saaho. He shares some car photos from sets
#Saaho
#Prabhas
#ArunVijay
బాహుబలి ప్రభంజనం తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తుండగా నిల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. మందిరా బేడీ, తమిళ నటుడు అరుణ్ విజయ్, ఎవిలిన్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరుణ్ విజయ్ తాజాగా ఈ చిత్ర షూట్ లో జాయిన్ అయిన సందర్భంగా చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
సాహో చిత్రానికి సంబందించిన ఎక్కువభాగం షూట్ దుబాయ్, అబుదాబి, రొమేనియాలో జరుగుతోంది. చాలా రోజులుగా ఈ ప్రాంతాలలోనే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై తరువాత ఎక్కువ బడ్జెట్ తో దుబాయ్ లో షూట్ జరుపుకుంటోన్న చిత్రం సాహో కావడం విశేషం.
కనివిని ఎరుగని యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంది. ఏకంగా యాక్షన్ సన్నివేశాలకే 90 కోట్లు వెచ్చిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అరుణ్ విజయ్ సాహో చిత్ర షూట్ లో జాయిన్ అయ్యాక తాజాగా కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. భారీ స్థాయిలో కారులతో చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు పోస్ట్ చేశాడు. అబుదాబిలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఆ మధ్యన బైక్ పై ప్రభాస్ స్టంట్స్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.