Allu Aravind Speech At Mahanati Success Party. This is Allu Arjun idea says Aravind
#AlluAravind
#Mahanati
అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై ప్రదర్శించబడుతోంది. నా పేరు సూర్య చిత్రం దేశభక్తి కథాంశంతో రూపొందినప్పటికీ కొంత డివైడ్ టాక్ వచ్చింది.ఇటీవల అల్లు అరవింద్ మహానటి చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో ఘనంగా పార్టీ ఇచ్చారు.నా పేరు సూర్య చిత్రానికి ఎఫెక్ట్ అని తెలిసిందే ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అందరిలో మెదిలింది. దానికి అల్లు అరవింద్ ఇచ్చిన సమాధానం ఆసక్తిగా ఉంది. మహా నటి చిత్ర యూనిట్ ని అభినందించాలనే నిర్ణయం బన్నీదే అని అల్లు అరవింద్ అన్నారు.
తెలుగు సినిమా అంటే బాహుబలి తీసిన మేమురా అని ఛాతీ విరుచుకుని చెప్పేలోపే మహానటి చిత్రం వచ్చిందని అల్లు అరవింద్ అన్నారు. ఆ సంతోషాన్ని మహానటి చిత్రం రెట్టింపు చేసిందని అన్నారు.
నాగ అశ్విన్ ఇలా తీస్తాడని అసలు ఊహించలేదని అరవింద్ అన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన వారంతా యువకులే అని, వారందరిని నా స్నేహితుడు అశ్విని దత్ నడిపించారని అల్లు అరవింద్ అన్నారు. వీరందరిని అభినందించకపోతే మహా తప్పు అని మనసుకు అనిపించింది. అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశా అని అరవింద్ అన్నారు
మహానటి చిత్రం విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న తరువాత బన్నీతో మాట్లాడా. నా పేరు సూర్య చిత్ర కలెక్షన్స్ కి మహానటి చిత్రం ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అంటే బన్నీ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచిందని అరవింద్ అన్నారు.
పెద్ద హీరోల చిత్రాలు ఏడాదికి 10 వస్తాయి డాడీ. కానీ మహానటి లాంటి చిత్రం పదేళ్లకు ఒక్కటే వస్తుంది అని అల్లు అర్జున్ అన్నాడు. నీ స్నేహితుడు అశ్వినీదత్ ని నీవు అభినందించాలి. టాలీవుడ్ మొత్తం సెలెబ్రేట్ చేసుకునే చిత్రం ఇది అని బన్నీ అన్నట్లు అల్లు అరవింద్ అన్నారు.