IPL 2018: RR vs CSK Match Preview

Oneindia Telugu 2018-05-11

Views 38

Back to winning ways after a hat-trick of defeats, a desperate Rajasthan Royals face a herculean task when they take on mighty Chennai Super Kings in a must-win Indian Premier League (IPL) match, here on Friday (May 11).

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఆథిథ్యమిస్తోంది. ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో తప్పగ గెలవాల్సిన పరిస్థితి.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గిపోయాయి. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరికాగా.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని తహతహలాడుతోంది.
చివరిసారిగా జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాజస్థాన్ 15 పరుగులతో గెలిచింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనే సత్తా చాటాలి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌లో గనుక రాజస్థాన్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే. కాకపోతే ఈ మ్యాచ్ రాజస్థాన్ సొంత మైదానం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింటిలో రాజస్థాన్ గెలిచింది.
కెప్టెన్ రహానే, సంజు శాంసన్‌లు మరింత మెరుగ్గా ఆడాలి. మరోవైపు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ప్, రాహుల్ త్రిపాఠి ఆశించిన మేరకు ఆడక పోవడంతో రాజస్థాన్ పరాజయం పాలవుతుంది. అయితే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలవాలంటే బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ కలిసి కట్టుగా రాణించాలి.

Share This Video


Download

  
Report form