At least 80 tourists safely escaped from lighted boat in West godavari district on Friday. some tourists were injured in this incident. they were shifted to Devipatnam hospital.
#Papikondal
#ChandrababuNaidu
#Bhadrachalam
పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. పాపికొండలను చూసేందుకు పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. అయితే స్థానికులు, పోలీసులు ప్రయాణీకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
పాపికొండల యాత్రకు సుమారు 80 మంది పర్యాటకులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఈ పడవ దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరుకోగానే పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. పోశమ్మ గుడి వద్ద నుండి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ పడవలో మంటలు వ్యాపించాయి.
దీంతో పడవలోని ప్రయాణీకులు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న వీరపులంక వాసులు నదిలో ఈదుకొంటూ వెళ్లి సుమారు 40 మంది పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ విషయమై సమాచారం అందుకొన్న పోలీసులు ఇతర అధికారులు కూడ హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకొని మిగిలిన వారిని కూడ రక్షించారు.
ఈ మంటల దాటికి పడవ పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్టుగా సమాచారం. అయితే ప్రయాణీకులను ఘటన స్థలం నుండి దేవీపట్నం తరలించారు.
పాత బోటు కావడం వల్ల ఇంజన్ వేడేక్కి మంటలు చేలరేగినట్టుగా పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఈ బోట్లను పర్యాటక శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ, అధికారుల నామమాత్రపు తనిఖీల కారణంగా ఈ పరిస్థితి వాటిల్లిందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు.