Sampoornesh Babu Talks About His Upcoming Movie Kobbari Matta

Filmibeat Telugu 2018-05-09

Views 8.3K

Kobbari Matta movie star Sampoornesh Babu birthday poster released. Kobbari Matta film directed by Rupak Ronaldson. It stars Burning Star - Sampoornesh Babu where he will be portrayed in the roles of three generations- Paparayudu, Pedarayudu, and Android. Steven Shankar (Hrudaya Kaleyam’s director) has written Story, Dialogues and Screenplay for Kobbari Matta.
#SampoorneshBabu
#HrudayaKaleyam

'బిగ్ బాస్' తెలుగు ఫస్ట్ సీజన్ పూర్తయిన తర్వాత సంపూర్ణేష్ బాబు సందడి తగ్గింది. ఈ మధ్య కాలంలో ఆయన తెలుగు తెరపై కనిపించక పోవడం, ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్‌తో వార్తల్లో ఉండే ఆయన కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోవడమే అందుకు కారణం. ఈ రోజు సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్ర బృందం బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. సమ్మర్ రిలీజ్‌గా ఈ సినిమా ఉండబోతోందని అందులో పేర్కొనబడి ఉంది. అంతే కాదు.... ఈ సారి మా సినిమా తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం అంటూ ప్రకటించుకోవడం గమనార్హం.
కొమరిమట్ట' సినిమా రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగ రాస్తుంది. తొలివారం మా చిత్రం రూ. 233.64 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నాం అంటూ ప్రమోషన్ పోస్టర్ విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది.
ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమా గురించి గతంలో సంపూ మాట్లాడుతూ.... ‘కొబ్బరి మట్ట' ఒక కుటుంబ కథా చిత్రం... నా దృష్టిలో కుటుంబం అంటే ఒక పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, ఇక పిల్లలు అంటే మన ఇష్టంతో కలుపుకునే కుడితి.... కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే మగ ఆవు. గొప్ప సెంటిమెంట్ ఈ సినిమా రాబోతోంది అని వ్యాఖ్యానించారు

Share This Video


Download

  
Report form