IPL 2018: Ben Stokes Caught By KXIP Players Double Act

Oneindia Telugu 2018-05-07

Views 125

Mayank Agarwal and Manoj Tiwary combined brilliantly to pull off a spectacular tag-team catch that will surely rival Boult's effort. Besides being an absolutely stunning effort, the catch was all the more important for Punjab because it brought to an end Ben Stokes' stay at the crease.
#Ben stokes
#Mayank agarwal
#manoj tiwary
#IPL 2018

బౌండరీలనే హద్దుగా బాదేస్తున్న బ్యాట్స్‌మెన్‌లకు ధీటుగా బదులిస్తున్నారు ఫీల్డర్లు. ఐపీఎల్ 11లో ఇప్పటికే అద్భుతమైన క్యాచ్‌లు చూశాం. కీలకంగా మారుతున్న క్యాచ్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పుతున్నాయి. ఐపీఎల్‌లో ఇలాంటి అత్యద్భుత క్యాచ్‌ల జాబితాలో మరో క్యాచ్ చేరింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో పంజాబ్ ఫీల్డర్లు మయాంక్ అగర్వాల్, మనోజ్ తివారీ అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యం కనబర్చారు. రెండు ఫోర్లు బాది 9 బంతుల్లో 12 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ప్రమాదకరంగా మారాడు.
ముజీబ్ బౌలింగ్‌లో బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. లాంగ్ ఆఫ్ వద్ద బౌండరీలైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తోన్న మయాంక్ అగర్వాల్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అదే క్యాచ్ కోసం మనోజ్ తివారి దూరం నుంచి పరిగెత్తుకొచ్చాడు. గాల్లోకి ఎగిరి అందుకున్నప్పటికీ.. తాను బౌండరీ లైన్‌ను తాకే అవకాశం ఉందని పసిగట్టిన మయాంక్ బంతిని తివారి వైపు విసిరాడు. అతడు బంతిని ఒడుపుగా అందుకోవడంతో నమ్మశక్యం కాని రీతిలో అవుటైన బెన్ స్టోక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్‌లో అత్యుత్తమ క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా రికార్డ్ ఉన్న స్టోక్స్ అలాంటి క్యాచ్‌కే ఔటవడం విశేషం. ఇదిలా ఉంటే అంతకుముందు రోజు మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌండరీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్ చేరిస్తే.. ముంబై ఇండియన్స్‌పై కోహ్లి డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్ అందర్నీ అలరించింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి సూపర్‌మ్యాన్‌లా ఒడిసిపట్టిన తీరు అందరినీ అలరించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS