కర్ణాటక ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్దుల ఆస్తుల వివరాలు తెలుసా??

Oneindia Telugu 2018-05-07

Views 224

Karnataka Assembly Elections 2018: Association of Democratic Reforms (ADR), Affidavits from Candidates reveal 93% Karnataka BJP candidates crorepatis. Total of 208 crorepatis from Congress, JD(S) has 154, Independent 155.
#Bengaluru
#Karnataka Assembly Elections 2018
#BJP
#Congress

కర్ణాటక శాసన సభ ఎన్నికలు 2018లో 2,500 మంది పోటీ చేస్తున్నారు. అందులో 883 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలతో పాటు స్వాతంత్ర పార్టీ అభ్యర్థులతో కలిపి 883 మంది కోటీశ్వరులు 2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి సరాసరి ఆస్తి రూ. 7. 54 కోట్లు ఉంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,500 మంది అభ్యర్థుల సమర్పించిన అఫిడవిట్లు (నామినేషన్లకు జత చేశారు) పరిశీలించిన అసోషియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.
అన్ని పార్టీల కోటీశ్వరుల జాబితా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాకృష్ణ (బెంగళూరు) రూ. 1,020 కోట్లు, ఎంటీబీ ఎన్. నాగరాజు (బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే) రూ. 1,015 కోట్లు, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ (బెంగళూరు గ్రామీణ జిల్లా కనకపుర) రూ. 840 కోట్లు ఆస్తి కలిగి ఉన్నారు.
అన్ని పార్టీలతో పోల్చుకుంటే బీజేపీలో 208 మంది (93 శాతం), కాంగ్రెస్ లో 207 మంది (94 శాతం), జేడీఎస్ లో 154 మంది (17 శాతం), ఆప్ లో 9 మంది (33 శాతం), స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 199 మంది (18శాతం) సరాసరి రూ. 1 కోటి ఆస్తి కలిగి ఉన్నారని ఎడీఆర్ వెల్లడించింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ భారీ మొత్తంలో నగదు ఖర్చు చెయ్యడానికి సిద్దం అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీకి పోటీగా జేడీఎస్ పార్టీ నాయకులు శాసన సభ ఎన్నికల్లో భారీ మొత్తంలో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS