Hyderabad Railway vendor brings out tea cans from inside train toilet

Oneindia Telugu 2018-05-03

Views 785

A vending contractor has been slapped with a fine of Rs 1 lakh by the Railways after a video surfaced suggesting mixing of water from a train toilet in tea and coffee, the South Central Railway (SCR) said on Wednesday.
ఇంట్లో వండింది తప్ప బయట ఏది తినాలన్నా కాస్త వెనకా ముందు ఆలోచించాల్సిందే. తినడానికి, తాగడానికి అది రుచిగానే ఉండవచ్చు.. కానీ దాన్ని తయారుచేసిన విధానం చూస్తే కొన్నిసార్లు ఢోకు వచ్చినంత పనవుతుంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణాల్లో చిరుతిళ్లు, ఇతరత్రా పానీయాలు సేవించేవారు ఒకసారి దీని గురించి తెలుసుకోవాల్సిందే. రైళ్లలో టీ, కాఫీలు విక్రయించే ఓ చిరువ్యాపారి.. అందుకోసం ఉపయోగించే క్యాన్లలో టాయిలెట్స్ నుంచి నీటిని సేకరించడం ఇటీవల ఓ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో ఆ నోటా.. ఈ నోటా.. చివరకు రైల్వే ఉన్నతాధికారుల దాకా వెళ్లింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో.. అది నిజమేనని తేలింది.
గతేడాది డిసెంబర్, 2017లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్-ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. సదరు వ్యాపారి పి.శివప్రసాద్ గా గుర్తించారు. టాయిలెట్ ట్యాప్స్ నుంచి నీటిని సేకరించి టీ, కాఫీ క్యాన్లలో మిక్స్ చేసినందుకు అతనికి రూ.1లక్ష జరిమానా విధించారు. ఇకమీద ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చిరువ్యాపారులపై నిఘా కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.
#SouthCentralRailway
#hyderabad

Share This Video


Download

  
Report form