New twist in Former Minister and senior leader Kanna Laxminarayana joining YSRCP.
మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంశంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన.. తనకు పదవి రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని , తేదీని కూడా ఖరారు చేశారు.
అయితే, అనారోగ్యం కారణంతో ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 25వ తేదీన వైసీపీలో చేరాలనుకున్న కన్నా.... వైసీపీ అధినేత జగన్‌కు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మెసేజ్ కారణంగా ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు కన్నా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణకు కాపు సమాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి ఆయన వైసీపీలో చేరకుండా టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణతో విశాఖపట్నంకు చెందిన ఓ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన మరో మంత్రి, మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కన్నాతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రత్యేక హోదా అంశం, ఏపీలో బీజేపీకి అంత పట్టు లేకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ తొలుత టీడీపీలో చేరాలని భావించారట. కానీ ఆయనకు సీటు ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ వైపు చూశారని అంటున్నారు.
#Kanna Laxminarayana
#Amit Shah
#Jagan
#TDP
#YCP
#Chandrababu naidu