"Bharath Ane Nenu" పవన్ కళ్యాణ్ అయితే ???

Oneindia Telugu 2018-04-25

Views 536

Koratala Siva about Pawan Kalyan. There is no comparison between Rangasthalam and Bharat ane nenu says Koratala.

భరత్ అనే నేను చిత్రం విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం అతిపెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. రాజకీయ నేపథ్యం ఉన్న కథ కావడంతో అభిమానులంతా ఈ చిత్రానికి కనెక్ట్ అయిపోయారు.
భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పవన్ అభిమానుల మధ్య చర్చని యాంకర్ దర్శకుడు కొరటాల మధ్య ఉంచారు. భరత్ అనే నేను చిత్రం పవన్ కళ్యాణ్ కైతే బావుండేదనే అభిప్రాయాన్ని అయన అభిమానులు వ్యక్తపరుస్తున్నారని యాంకర్ ప్రశించడంతో కొరటాల సంధానం ఇచ్చారు. అభిమానులు కోరుకోవడంలో తప్పేముంది అని కొరటాల అన్నారు.
భరత్ అనే నేను చిత్ర కథ సిద్ధం చేసుకున్నప్పుడు తాను మహేష్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేదని అన్నారు. మహేష్ బాబు రాజకీయాలు పట్టించుకోరని ఆయన అన్నారు. ఈ కథకు న్యూట్రల్ గా ఉండే హీరో కావాలని భావించామని అది మహేష్ బాబే అని కొరటాల అన్నారు.
రంగస్థలం, భరత్ అనే నేను రెండు చిత్రాలు రాజకీయ నేపథ్యంతో వరుసగా విడుదల అయ్యాయి. ఈ వాదనని కొరటాల ఖండించారు. రంగస్థలం చిత్రం రాజకీయ నేపథ్యం ఉన్న కథ కాదని అన్నారు. ఆ చిత్రం ఒక గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారం అని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు వస్తున్న ప్రతి చిత్రంలోనూ విలన్ రూపంలోనో, మంత్రి రూపంలోనో రాజకీయానికి సంబంధించిన అంశం ఉంటుంది. అలా అని ప్రతి చిత్రాన్ని పొలిటికల్ మూవీ అనలేమని కొరటాల అన్నారు.
తాను కేవలం 10 చిత్రాలు మాత్రమే చేసి ఆ తరువాత దర్శకత్వం ఆపేస్తానని కొరటాల అన్నారు. ప్రతి చిత్రం చేసే సమయంలో తనకు చాలా ఒత్తిడి ఉంటుందని కొరటాల అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS