Hardik Pandya Spotted Flirting With Urvashi Rautela

Filmibeat Telugu 2018-04-24

Views 273

Urvashi Rautela is dating cricketer Hardik Pandya. Hardik Pandya once again in news.
# Hardik Pandya
#Urvashi Rautela
టీం ఇండియా యంగ్ క్రికెటర్ హార్థిక్ పాండ్య పేరు ప్రస్తుతం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ డాషింగ్ బ్యాట్స్ మాన్ లవ్ ఎఫైర్స్ గురించి మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన హార్థిక్ పాండ్య, బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అవ్రం మధ్య డీప్ ఎఫైర్ సాగుతోందంటూ వార్తలు వచ్చాయి. హార్థిక్ ప్రేమాయణం గురించి సినీ, క్రీడా అభిమానుల్లో చర్చ జరిగింది. హార్థిక్ లవ్ స్టోరీలో మరో ట్విస్ట్. హార్థిక్ ఎఫైర్ ఎల్లి అవ్రంతో కాదని, మరో హాట్ బ్యూటీ ఈ యంగ్ ప్లేయర్ తో క్లోజ్ గా ఉంటోందని జాతీయ పత్రికల్లో వార్తలువస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఇటీవల హేట్ స్టోరీ 4 తో సెగలు పుట్టించిన ఊర్వశి రౌటేలా. ఇటీవల ఓ పార్టీ హాజరైన వీరిద్దరూ సన్నిహితంగా కచాలా సేపు గడిపారని వివిధ మీడియా హౌసెస్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఆ పార్టీలో ఎక్కువ టైమ్ ఊర్వశి రౌటేలా హార్థిక్ పాండ్యతో గడిపిందని అంటున్నారు. హార్థిక్, ఊర్వశి రౌటేలా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రికెట్ బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఎఫైర్ సాగడం ఇదేం కొత్త కాదు. రవిశాస్త్రి టైం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు చాలా ప్రేమ కథలు సాగాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS