Filmmaker Ram Gopal Varma on Thursday apologised to Telugu actor-politician Pawan Kalyan, his fans and his family, Now latest he again did sensational comments on pawan kalyan.
పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ కామెంట్స్ చెయ్యమని శ్రీ రెడ్డికి స్వయంగా చెప్పిన వర్మ ఆ తరువాత పవన్ కళ్యాణ్ కు పవన్ తల్లికి సారి చెప్పడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చెయ్యనని వర్మ తన తల్లిమీద ఒట్టు వెయ్యడం జరిగింది. కానీ ఒట్టేసి గంటలు కూడా గడవక ముందే మాట మార్చాడు. ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నట్టు ఆర్జీవీ ట్విట్టర్ లో తెలిపాడు. తన తల్లి అంగీకారంతో ఒట్టు తీసి గట్టుమీద పెట్టబోతున్నట్లు ట్విట్టర్ లో తెలిపాడు. తాజాగా మళ్ళి పవన్ పై హాట్ కామెంట్స్ చేసిన వర్మ.
‘నేను చేసిన పనికి సారీ చెప్పి పవన్ కల్యాణ్ మీద ఇక కామెంట్ చేయనని మా అమ్మ మీద ఒట్టేశాను. ఆ తర్వాత నేను చంద్రబాబు, లోకేశ్, శ్రీని రాజు, రాధాకృష్ణ, రవి ప్రకాశ్, మూర్తి కూటమిలో ఉన్నానని పవన్ ఆరోపించారు. వారి ఆరోపణలు నాకు నచ్చని కారణంగా ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నానని తెలిపాడు.
మొదటిసారి లాయర్ల కంటే క్లయింట్ ఎక్కువగా మాట్లాడటం చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ మంచి లాయర్లను పెట్టుకోనప్పుడు డబ్బంతా ఎందుకు వృథా చేయడం.లేదంటే బవారి సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి లాయర్ కోట్లు తెప్పించి ఆయన ఫ్యాన్స్‌కు పంచడం జరిగిందా ? ఈ ప్రశ్న నేను సాధారణంగా అడుగుతున్నానని వర్మ ట్వీట్ చేసాడు.
వర్మ సాధారణంగా ఒక మాట మీద నిలబడదు ఆయన ఇలా మాడ్లడడం ఇది మొదటిసారి కాదు, గతంలో వర్మ అనేక సందర్భాల్లో అనేక సార్లు మాట మార్చడం జరిగింది. పవన్, వర్మ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఒకవైపు పవన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి తనను దుసిస్తున్న వారిపై ఎందగడుతున్నాడు.