Jana Sena chief Pawan Kalyan on friday went to Film Chamber to talk about Sri Reddy issue.Mega Family Members Have Attended to film chamber along with pawan kalyan.Fans reached to film chamber in a huge number.
పవన్ కళ్యాణ్ నేరుగా ఫిలిం ఛాంబర్‌కు వచ్చారు. ఆయనతో పాటు నాగబాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు. వీరు పవన్‌కు మద్దతుగా ఫిలిం చాంబర్‌కు వచ్చారు. న్యాయవాదులతో భేటీ అయ్యారు. అంతేకాదు, సినీ ప్రముఖులు అందరూ చాంబర్‌కు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అవుదామని చెప్పారు.నటి హేమ,శివాజీ రాజ ,బండ్ల గణేష్ ఫిలిం ఛాంబర్ చేరుకున్నారు.
ఫిలిం చాంబర్‌లో పవన్ కళ్యాణ్ రెండు వైపులా తలుపులు పెట్టుకొని గదిలో కూర్చున్నట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ఫిలిం చాంబర్‌లో పలువురిని ప్రశ్నించారని తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకే సమావేశానికి ప్రముఖులు రావాలని పిలుపునిచ్చారు.
ఫిలిం చాంబర్‌కు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని చూసేందుకు ఎగబడ్డారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన కుట్ర జరుగుతోందని జనసేన అభిప్రాయపడుతోంది. గత ఆరు నెలలుగా పవన్ పైన కుట్ర సాగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.