SriReddy gives counter to Nagababu. She warns JeevithaRajashekhar
మెగా బ్రదర్ నాగబాబు కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడారో లేదో అప్పుడే శ్రీరెడ్డి నుంచి కౌంటర్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల గురించి నాగబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీరెడ్డి టాపిక్, కాస్టింగ్ కౌచ్ తదితర అంశాల గురించి ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.
నాగబాబు మీడియా సమావేశాల్లో ప్రస్తావించిన విషయాలకు శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సంచలన కామెంట్లు పెట్టింది. ఈ సమయంలో తాను పోరాటం నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి తేల్చి చెప్పింది.
ఇక తాను ఎవ్వరికీ బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశాన్ని ఇవ్వనని, తన జీవితంలో జరిగిన మంచి, చెడు అన్ని విషయాలని బయటకు వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. తన స్నేహితుల గురించి కూడా చెబుతానని అంటోంది. ఒక మనిషిగా తాను మంచిపనులు, చెడు పనులు కూడా చేసానని శ్రీరెడ్డి వెల్లడించింది.
తన స్నేహితుల సహకారంతో పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నానని శ్రీరెడ్డి తెలిపింది. పవన్ కళ్యాణ్ చట్ట పరంగా పోరాటం చేయాలని చెప్పారు. ఒకే సర్ అలాగే చేస్తాను అంటూ కామెంట్ పెట్టింది.
జనసేన పార్టీ శ్రీధర్ గారు తాను సమస్య పరిష్కరానికి పోరాటం చేస్తున్నానని సహకరిస్తానని అన్నారు. ఇప్పుడు సహకరించాలని శ్రీరెడ్డి కోరింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకుంటున్నా. క్షమాపణ కోరి ఆయనతో గొడవ ఇప్పటికే ముగించా. కానీ చట్ట పరంగా మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తాని, గెట్ రెడీ జీవితరాజశేఖర్.. లీక్స్ బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మంగళవారం మహా న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమాన్ని కూడా శ్రీరెడ్డి ప్రస్తావించింది. 25 మంది ఒక వైపు, తాము ముగ్గురం మాత్రమే ఒకవైపు.. మహాన్యూస్ ఛానల్ చాలా బాగా ప్లాన్ చేసారని ఎద్దేవా చేసింది. ముందుగా తెలిసి ఉంటె తాము కనీసం 10 మందితో అయినా వెళ్లేవారం అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అయినా పరవాలేదు తాను ప్రతి ఒక్కరికి సమాధానంఇస్తా.. పడిలేచిన కెరటాని అంటూ సోషల్ మీడియాలో సంచలన కామెంట్లు పోస్ట్ చేసింది