Actress Hema responds on Srireddy issue. Hema fires on News Channels
ప్రముఖ నటి హేమ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఒకరంగా ఇండస్ట్రీని దూషిస్తున్న వారిపై ఆమె విరుచుపడ్డారని చెప్పొచ్చు. ఏం జరిగినా తమని దూషిచడం సరికాదని ఆమె అన్నారు.
ఇండస్ట్రీలో డాష్ ముండలు లేరా అంటూ టివీ5 ఛానల్ యాంకర్ మాట్లాడిన మాటని హేమ తప్పుబట్టారు. దీని కోసం బాగా శిక్షణ పొంది న్యూస్ ఛానల్స్‌లో న్యూస్ రీడర్స్ అయ్యారని హేమ ఎద్దేవా చేశారు.
హేమ మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా శ్రీరెడ్డి గురించి వ్యాఖ్యలు చేసారు. టివి ఛానల్స్‌లో డిబేట్లు నిర్వహించేవారు ఆవిడ పర్సనల్ విషయాలు ఎత్తకండి అంటారు. ఆమెకేనా పర్సనల్ విషయాలు.. మాకు కుటుంబాలు లేవా అని హేమ ప్రశ్నించారు. ఆర్టిస్టులు అయిన పాపానికి మా కుటుంబాలు డాష్ అయిపోవాలా అని ప్రశ్నించారు.
ఇలాంటి క్యారెక్టర్లు ఇంకో నలుగురిని తీసుకుని వచ్చి మిగిలిన హీరోల తల్లులని కూడా తిట్టించండి సరిపోతుంది అంటూ శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలని పరోక్షంగా ప్రస్తావించారు. అలా చేస్తే తాము ఇంకా ఐకమత్యంగా మారుతామని హేమ అన్నారు.
ఈ రంగంలో ఆడవారికి భద్రత ఉందని మీడియా ఛానల్స్ వారు ప్రకటన ఇవ్వండి. ఆధారం అక్కడికే వెళ్లి ఉద్యోగాలు చేస్తాం అని హేమ అన్నారు. బస్టాండ్ లో నిలుచున్నా కూడా ఆడవారికి భద్రత ఉండడం లేదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేట్ సంస్థలు ఎక్కడా కూడా ఆడవారికి భద్రత ఉండడం లేదని అలాంటప్పుడు ఒక్క చిత్ర పరిశ్రమనే దూషించడం ఏంటని ఆమె అన్నారు.