Barath Ane Nenu : Mahesh Has Set Its Mark

Filmibeat Telugu 2018-04-17

Views 177

Director Koratala Siva's Bharat Ane Nenu starring Mahesh Babu is getting a fantastic response for advance booking with tickets in many theatres across the world already being sold out four days ahead of its release.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ నేటి నుండి మొదలైంది.
భరత్ అనే నేను' చిత్రం ప్రీమియర్ షోలు యూఎస్ఏలో కనీవినీ ఎరుగని స్థాయిలో వేస్తున్నారు. నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 750 స్క్రీన్లలో సినిమా విడుదలకు ఒక రోజు ముందే దాదాపు 2000 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా షోలకు సంబంధించి టికెట్స్ అమ్ముడయ్యాయి.
భరత్ అనే నేను' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ స్క్రీన్ కౌంట్ రిలీజ్.
బుక్ మై షో లాంటి సైట్లలో అలా టికెట్స్ పెట్టడమే ఆలస్యం వాటిని హాం ఫట్ అనిపించేశారు అభిమానులు. టికెట్స్ అందుబాటులోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే వేగంగా అమ్ముడు పోయాయి. ఫేమస్ మల్టీప్లెక్సులు, థియేటర్లలో ఆల్రెడీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తుండగా..... బి, సి గ్రేడ్ థియేటర్లలో కొన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వేగంగా సోల్డ్ ఔట్ అవుతున్నాయి. ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
యకె/యూఏఈలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు ‘భరత్ అనే నేను' సినిమా గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఫైనల్ ట్రయల్ పూర్తయింది. వాటి ద్వారా వస్తున్న రిపోర్ట్స్ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సినిమా చూశారు. అద్భుతమైన కథతో సినిమా ఆకట్టుకుంటుందని, మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంతా పొగిడేస్తున్నారు. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form