నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

Oneindia Telugu 2018-04-16

Views 1

A special NIA court will pronounce judgment in the 2007 Mecca Masjid case on Monday, 11 years after the powerful took nine people and injured more than 50 during Friday prayers near Hyderabad’s iconic Charminar.

11ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. నిందితులపై నేరారోపణ నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో సోమవారం కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కోర్టు, పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిందితులపై అభియోగాలు రుజువు కాకపోవడంతో ఐదుగురిని నిర్ధోషులుగా కోర్టు పేర్కొందని, కేసు కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. నిందితులైన ఆసిమానంద, దేవేంద్ర గుప్తా, లోకేష్ శర్మ, భరత్ భాయి, రాజేష్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే బెయిలుపై ఉన్న ఇద్దరు నిందితులు అలాగే ఉంటారని, మరో ముగ్గురుపై వేరే కేసులు ఉన్న కారణంగా వారు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని తెలిపారు. మిగితా నిందితులపై ఛార్జీషీటు కొనసాగుతోందని న్యాయవాదులు తెలిపారు.
2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) బాంబు పేలడంతో 9మంది మరణించగా, 58 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో సుమారు 5వేల మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఘటన తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. అయితే ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోంమంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్‌ 4న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి అప్పగించింది. అప్పట్లో రెండు కేసుల్ని తిరిగి నమోదు చేసిన ఎన్‌ఐఏ మొత్తం పదిమంది నిందితుల్ని గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్‌ఐఏ రెండు అభియోగపత్రాల్ని న్యాయస్థానంలో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS