Actress Shruthi Challenges Tollywood Top Heroes Producers

Filmibeat Telugu 2018-04-16

Views 34

Actress Shruthi Challenges Tollywood Top Heroes & Producers Over Film Industry.

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్' అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శృతి సంచలన కామెంట్స్ చేశారు. శివాజీ రాజా మీద, పవన్ కళ్యాణ్, ఇతర హీరోల మీద ఆమె ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఏమిటీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంతకాలం ముసుగులో గుద్దులాటలాగా ఉండేది. ఇపుడు మేమంతా చెబుతుంటే జనాలకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందని తెలిపారు.
సినిమా వాళ్లు అనగానే బయట అందరికీ ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఇపుడెందుకు మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు పడుకుని క్యారెక్టర్లు తెచ్చుకున్నారు కదా అని కొందరు అంటున్నారు. మేము అలా పడుకుని చేసుకుని ఉంటే ఇలా బయటకు వచ్చేవారం కాదు. ఎవరైతే ఇపుడు బయటకు రాకుండా ఉన్నారో వాళ్లలో మేము ఒకరిలా ఉండేవారం. కరాటే కళ్యాణి, సత్యా చౌదరి ఎవరొచ్చినా మేము మాట్లాడటానికి సిద్ధమే అని..... నటి శృతి అన్నారు.
డైరెక్షన్ డిపార్టుమెంటు వారు, ప్రొడ్యూసర్లు ఎవరూ కూడా బయటకు మాట్లాడటం లేదు. నేను టీవీ ఛానల్స్ లైవ్‌లో కూడా చెప్పాను... శివాజీ రాజా అలాంటోడే, అమ్మాయిలను ఇలా చేస్తాడు అని డైరెక్టుగానే చెప్పాను. ఈ రోజు ఆయన ఎందుకు స్పందించడం లేదు. కత్తి మహేష్ మీద ఓ అమ్మాయి ఆరోపణలు చేస్తే నేను అలా చేయలేదు అంటూ బయటకు వచ్చి నీ మీద కేసు వేస్తానని ప్రకటన చేశాడు. మరి శివాజీ రాజా ఎందుకు బయటకు రావడం లేదు...అని శృతి ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ పెద్ద పెద్దోళ్లే ఉన్నారు. కానీ వారు ఎందుకు రావడం లేదు? ఇపుడొచ్చి మా అందరికీ హెల్ప్ చేయమనండి. మాకు యాక్టింగ్ రాదా? పడుకుంటేనే వేషాలు ఇస్తారా? వేరే అమ్మాయిలను పడుకోబెడితేనే అవకాశాలిస్తారా?...... పడుకోవట్లేదని మాకు సినిమాల్లో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. సీరియల్స్ లో కొంత మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి మంచి వారి వల్లే మేము ఈ మాత్రం అయినా ఉన్నాం. మిగతా చెడ్డ వారి వల్ల పైకి ఎదగలేక పోతున్నాం. ఇది మీరందరూ గమనించాలి.... అని శృతి అన్నారు.

Share This Video


Download

  
Report form