టోర్నీ కోసం రూ.5లక్షల ఆర్థిక సాయం

Oneindia Telugu 2018-04-14

Views 182

Janasena President Pawan Kalyan on Saturday participated as guest in a tournament for the physically challenged.

నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీకి ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శనివారం ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దివ్యాంగులైన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. దివ్యాంగులంతా బాగా ఆడాలని, ప్రజలను ఆకట్టుకోవాలని అన్నారు. ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టుకు రూ. లక్ష ఇస్తానని చెప్పారు. ఇంతకుముందే టోర్నీ కోసం రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు పవన్.
దివ్యాంగులంతా బాగా ఆడాలని, ప్రజలను ఆకట్టుకోవాలని అన్నారు. ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టుకు రూ. లక్ష ఇస్తానని చెప్పారు. ఇంతకుముందే టోర్నీ కోసం రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు పవన్.
కాగా, ఈ టోర్నీలో మొత్తం 24జట్లు పాల్గొన్నాయి. మీకు(దివ్యాంగులకు) నిలబడకపోతే ఎవరికి అండగా ఉంటామని పవన్ అన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లేనని అన్నారు. దివ్యాంగుల కోసం సెప్టెంబర్‌లోగా రూ. కోటి కార్పస్ ఫండ్ స్నేహితులను అడుగుతానని పవన్ చెప్పారు. క్రికెట్ తాను తక్కువగా చూస్తానని అన్నారు. నవజోత్ సింగ్ సిద్ధు ఆడిన కాలం తర్వాత తాను క్రికెట్ చూడలేదని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS